శేరిలింగంపల్లి డివిజన్-106 కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మల్లెల.జయ నియామకం…

శేరిలింగంపల్లి డివిజన్-106 కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మల్లెల.జయ నియామకం…

స్టూడియో 10 రంగారెడ్డి ప్రతినిధి కేబీ రాజు:

కాంగ్రెస్ జెండా పట్టుకుని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చురుకుగా పాల్గొని తోటి మహిళలను ప్రోత్సహిస్తూ ప్రజల మనిషిగా ఉంటానని రాజీవ్ గృహకల్పకు చెందిన మల్లెల జయను శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి 106 డివిజన్ ప్రధాన కార్యదర్శిగా నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. అంతే కాకుండా జై కృషి సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనా మొదలుకొని ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తుందని వి. జగదీశ్వర్ గౌడ్ అభినందించారు.డివిజన్ ప్రెసిడెంట్ జహంగీర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో పార్టీ కార్యక్రమాలకు ముందజలో వుంటూ ప్రజల సమస్యల పరిష్కారాలను చూపుతున్న మల్లెల. జయను నియమించడం జరిగిందన్నారు. శేరిలింగంపల్లి డివిజన్లలో ఎన్నో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని వాటిని పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎంతోమంది ఇండ్లు లేక దరఖాస్తులు పెట్టుకున్నా నేటి వరకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయలేకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం పనిచేస్తూ త్వరలోనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసిందని పేర్కొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!