రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 6:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రేబిస్ టీకాలు వేయడం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంపుడు కుక్కలను జాగ్రత్తగా పెంచడంతో పాటు వాటి సంరక్షణ అవి కరచినచో ప్రాణాలకు ప్రమాదం ఉంటుందన్నారు.కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం చేస్తున్న యాంటీ రాబిస్ పెంపుడు కుక్కల యజమాని వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ రామాయంపేట ఎంపీడీవో ఆఫీస్ ప్రాంగణంలోని గల ప్రాంతీయ పశు వైద్యశాల యందు పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మూడు నెలల వయస్సు పైబడిన పెంపుడు కుక్కలకు మరియు పిల్లులకు ఉచితంగా రేబీస్ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందన్నారు.ఇట్టి అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ భాదే చంద్రం వెటర్నరీ అసిస్టెంట్ సురేష్ హరి తదితరులు పాల్గొన్నారు.