సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి(మెదక్ జిల్లా).
తేది .06 .07.2024
*పరిపాలన ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో R.D.O, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహణ
ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు
దరఖాస్తులు స్వీకరణ
మెదక్ రెవిన్యూ డివిజనల్ అధికారి k.రమాదేవి.
సోమవారం నుండి జిల్లాలోని ఆర్డీవో అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఆయా మండలానికి సంబంధించిన సమస్యను సంబంధిత ఆర్డీవో కార్యాలయాలు మండల తాసిల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు రూపంలో అందజేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారి రమాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఆర్డిఓ కార్యాలయం నుంచి ఆమె మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కారంలో ధరణిలో ఏ మాడ్యూల్ పై ప్రజలు దరఖాస్తు చేయాలనే అంశంపై తహసీల్దార్ ర్యాలయంలోని హెల్ప్ డెస్క్ ల్లోను, మీ సేవా కేంద్రాల్లోను ప్రజలకు తెలిసే విధంగా స్పష్టంగా తెలుగులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి తహసిల్దారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. మండల స్థాయిలో ప్రజలు సుదూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడానికి వస్తున్నారని, పరిపాలన ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో R.D.O, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మండలస్థాయిలో ప్రజావాణి నిర్వహించడం వల్ల ప్రజలకు దూరా భారంతో పాటు వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయని ఆమె పేర్కొన్నారు ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు తాసిల్దాకార్యాలయాల్లోను, ఆర్డిఓ కార్యాలయాల్లో నందు ప్రజావాణి ప్రారంభం అవుతుందని, అన్నారు