డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు” పురస్కరించుకొని సర్వసిద్ది పి.హెచ్.సి పరిధి లో నిర్వహించిన అవగాహన ర్యాలీ లు, సదస్సులు..
అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో గల అన్ని గ్రామాల్లో అవగాహన ర్యాలీ లు జిల్లా మలేరియా అధికారి కె .వరహాలు దొర ఆదేశాలు మేరకు “డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు” పురస్కరించుకొని కీటక జనిత వ్యాధులపై జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి పి.జె.ఎం.అర్.పి.నాయుడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి తదుపరి అవగాహన ర్యాలీ లు నిర్వహించామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్. ఎన్ వాసంతి తెలిపారు. అందులో భాగంగా అన్ని గ్రామాల్లో ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు వారి పర్యవేక్షణలో ర్యాలీ లు నిర్వహించి కీటక జనిత వ్యాధులపై వారు అవగాహన కల్పించారు.వీరితో పాటు హెల్త్ సూపర్ వైజర్ ఎస్ ఎస్ వి ప్రకాష్. హెల్త్ విజిటర్ వై.సూర్య కుమారి పాల్గొన్నారు. వేమగిరి, జె.వి.పాలెం గ్రామల్లో . అవగాహన సదస్సులు నిర్వహించి తదుపరి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్.డి.పి క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పి.ఎన్.వి.ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధులయిన మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు వలన, ఫైలేరియా, మెదడు వాపు క్యూలెక్స్ దోమ కాటు వలన,డెంగ్యూ ,చికెన్ గున్యా ఈడిస్ ఈజిప్ట్ అనే టైగర్ దోమ కాటు వలన ఈ సీజన్ లో ఆ జ్వరాలు బారిన పడతారని ,ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ అలాగే ఇంట్లో నిలువ వున్న నీటి పాత్రలపై మూతలు ఉంచుకోవాలని తద్వారా కీటక జనిత వ్యాధులకు కారణమైన దోమలను లార్వా దశలోనే సులభంగా అరికట్టవచ్చునని దీని కొరకు ఫ్రై డే.. డ్రై డే సందర్భంగా మనం ప్రతి శుక్రవారం , శనివారం ,అది వారం నిర్వహించే యాంటీ లార్వా ఆపరేషన్ వలన నిల్వ నీటిలో వుండే అనగా ఫ్రిజ్ వెనుక తొట్టెలో, టైర్ లు లో, రుబ్బు రోళ్లు లో , ప్లాస్టిక్ డ్రమ్ములు లో , పాడుపడిన పాత్రలు , ఎయిర్ కూలర్ లు లో, కొబ్బరి చిప్పలు లో ,సిమెంట్ గోలల్లో , డ్రింక్ సీసాలు లో , పూల కుండీలు లో లార్వాలను గుర్తించి తక్షణం వాటిని నిర్మూలించవచ్చునని తద్వారా దోమల వృద్ధి నీ లార్వా దశలోనే అరికట్టగలమని లార్వా నివాసముండే అవాసాలను అనగా కొబ్బరి చిప్పలు , ప్లాస్టిక్ డ్రింక్ సీసాలు, మట్టి పాత్రలు , తినిన తాటి కాయలు, ప్లాస్టిక్ డ్రమ్ములు , పూల కుండీలు ప్రదర్శించి అవగాహన కల్పించారు. వేమగిరి లో అవగాహన ర్యాలీ సందర్భంగా 1.తరిమేద్దాం ..తరిమేద్దాం. డెంగ్యూ వ్యాధి ని తరిమేద్దాం. 2.దోమ కాటు.. మనకు చేటు 3.దోమలు లేని ఇల్లు…. జ్వరాలు అక్కడ నిల్ ; 4.నీటి నిల్వలు లున్న ఇల్లు .. దోమలకది పుట్టినిల్లు అనే నినాదాలు తో డాక్టర్ పి.ఎన్.వి.ఎస్. ప్రసాద్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వీరితో పాటు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు జి.కొండ బాబు, ఎల్.వీణ వాహిని , హెల్త్ సెక్రటరీ లు కె.విజయ లక్ష్మి, పి. శ్రీరాములు , ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.