ప్రమాణానికి రాని ప్రత్యర్థులపై నిప్పులు చేరిగిన కాంగ్రెస్ నాయకులు

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జులై 2:- మెదక్ జిల్లా రామాయంపేట కాంగ్రెస్ నాయకుల గ్రూపు తగాదాలు ప్రమాణాలు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. పై స్థాయి నాయకులు వెనుక ఉండి చోటామోటా నాయకుల మధ్య తగాదాలు పెట్టి చోద్యం చూస్తున్నట్లు కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే రామాయంపేటలో నాలుగు రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల గ్రూపుల మధ్య మట్టితో కథ తారస్థాయికి చేరింది. మల్లెచెరువులో మట్టి వ్యాపారం చేస్తున్నారని మరొకరు మట్టిని అమ్ముకుంటున్నారని మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం జరిగింది.ఈ విషయంలో మేము రైతులకు మట్టిని సరఫరా చేస్తుంటే కొందరు తమను వచ్చి వాటా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. దానిపై సదరు ప్రత్యర్ధులు తాము వాటా గాని డబ్బు గాని డిమాండ్ చేసినట్లయితే దేనికైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. అంతేకాకుండా స్థానిక మహంకాళి దేవాలయం వద్ద తడిగుడ్డలతో ప్రమాణానికి ప్రత్యర్థులు రావాలని సమయం కూడా నిర్ణయించారు. అదేవిధంగా మంగళవారం ఉదయం కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ చిలుక స్వామి వినయ్ సాగర్ సవాలుకు సిద్ధంగా ఉన్నారు.వీరు ఇచ్చిన 10 గంటల సమయానికి కానీ 11 గంటలకు కానీ అభ్యర్థులు రాకపోవడంతో వారే బట్టలు విప్పి మహకాలమ్మ దేవాలయంలో తాము ఎలాంటి భాగం అడగలేదని డబ్బులు డిమాండ్ చేయలేదని ప్రమాణం చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇదంతా పార్టీని బ్రష్టు పటించడానికి కొందరు నడుము కట్టారని ఆరోపించారు.మట్టిని ఒక రైతు పేరు మీద పర్మిషన్ తీసుకొని ప్రైవేట్ భూములు వేశారని తెలిపారు.అంతే కాకుండా చిన్న కారు సన్నగా రైతుల పొలాలకు వెళ్లవలసిన చిల్లర మట్టిని అమ్ముకోవడం ఏంటని ప్రశ్నిస్తే తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం సహించమని దేనికైనా సిద్ధమని వారు హెచ్చరించారు. కౌన్సిలర్ చిలుక గంగాధర్ మాట్లాడుతూ నిజాయితీ పరుడైన ఎమ్మెల్యే రోహిత్ రావు పేరు చెడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీలో కొందరు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఉంది కదా అధికారం వచ్చింది కదా అని ఎలాంటి పనులకైనా అవినీతికి పాల్పడితే సహించే లేదని ఆయన హెచ్చరించారు.పార్టీ పేరు కొట్టడానికి ఎమ్మెల్యే పేరు నుంచి అడగటానికి ఇలాంటి పనులు చేస్తే ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కొందరు వ్యక్తులు సర్పంచిగా ఉండగానే కుంటల స్వాధీనం చేసుకున్నారని ఇవన్నీ జరిగిన ఇప్పుడు మళ్లీ వారే ఆరోపణ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ కు వ్యతిరేకమైన మాటలు కాంగ్రెస్ నాయకులపై మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.ఏవేవో భూకబ్జాలపై మాట్లాడడం అవివేకమని వీటన్నిటిపై విచారణ జరిపించాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దోమకొండ యాదగిరి కుమార్ సాగర్ చింతల స్వామి విరాట్ తదితరులు

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!