జూలై 4న దేశవాప్త విద్య సంస్థల బందును విజయవంతం చేయండి
— PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపు
చేవెళ్ళ: PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూలై 4న దేశవ్యాప్త విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని ప్రకటించడం జరిగింది. విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో భారత్ బంద్ నువిజయవంతం చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ కార్యదర్శి రాజేష్ లు మాట్లాడుతూ నీట్ మరియు నెట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఈ బందును నిర్వహించడం జరుగుతుందని దానితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలలో నెలకొన్న సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో కాస్మోటిక్ చార్జీలను పెంచాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. బిజెపి హయంలో పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా నీటి పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. ప్రైవేటు స్కూల్లో ఫీజులు దోపిడిని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు PDSU నాయకులు అశోక్, సిద్ధార్థ, వి సిద్ధార్థ, బన్నీ ,హరీష్, అజయ్ శివప్రసాద్ , హేమంత్, సాయి , అఖిల్ , నరసింహ తదితరులు పాల్గొన్నారు.