గోవిందరావుపేట మండలం నందు పసర సీఐగా రవీందర్ గారు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారు…
తేది: 02.07.2024 మంగళవారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల పసర పోలీస్ స్టేషన్ యందు సీఐగా రవీందర్ గారు నూతనంగా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారిని గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భముగా వెంకటకృష్ణ గారు మాట్లాడుతూ పోలీస్ అంటేనే మనల్ని మరియు శాంతి భద్రతలను కాపాడుతూ మనందరికీ రక్షణగా ఉండే రక్షణ కవచం లాంటి వారని రక్షకభటులు అని, ప్రజలను నిత్యం కాపలా కాస్తూ సమాజంలోని అవినీతిని తొలగించే గొప్ప ఉద్యోగ బాధ్యత పోలీసులది అని అన్నారు. మనకోసం ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్న పోలీసన్నకు సలాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, సహకార సంఘం అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, కార్మికశాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, కణతల నాగేందర్ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి జంపాల చంద్రశేఖర్, చొప్పదండి వసంత, చిక్కుల్ల వెంకటేష్, తుమ్మల శివ, నిమ్మగడ్డ రాము తదితర నాయకులు పాల్గొన్నారు.