పాలకుర్తి నియోజకవర్గం తేదీ : 02-07-2024
రెండో రోజు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరకస్థులు స్వీకరించిన స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సి రెడ్డి గారు..
పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామంలో మండలంలో సంబంధిత మండల అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి పలు సమస్యలు తెలుసుకొని అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి గారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉదేశ్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు, గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు, ప్రజల సమస్యలను సాధ్యమైన రీతిలో పరిష్కరం చెయ్యాలనే ఉదేశ్యంతో గ్రామాలలో తిరుగుతూ వారి సమస్యలు విని పరిష్కరిస్తానని అన్నారు..
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పార్టీ శ్రేణులు, యూత్ నాయకులు, మహిళ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు..