సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్).
తేది -01.07.2024 ( సోమవారం )
మెదక్ జిల్లా సమర్థవంతమైన పాలనే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి.
కలెక్టర్ రాహుల్ రాజ్
క్షేత్రస్థాయి పర్యటన అధికారులు సమయపాలన పాటించాలి .
ప్రతి ఒక్క క్షేత్రస్థాయి అధికారి జాబ్ చార్ట్ తప్పనిసరిగా పాటించాలి .
సోమవారం తప్పితేమిగతా రోజులన్నీ క్షేత్రస్థాయి ఆకస్మిక పర్యటనలలోనే కలెక్టర్.
ప్లాస్టిక్ రహిత కలెక్టరేట్ గా జిల్లా కలెక్టర్ కార్యాలయం.
ప్రభుత్వ అధికారులందరూ గ్లాస్,స్టీల్ వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలి.
సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో
ఫస్ట్ ఫ్లోర్ ,సెకండ్ ఫ్లోర్లో తాగు నీటికొరకు ప్రభుత్వ అధికారులకు వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు.
ఏ సమావేశంలో నైనా ప్లాస్టిక్ బాటిల్ వాటర్ . నిషేధం.
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఆఫీస్ . విధానం అమలు
ఈ ఆఫీస్ ద్వారా అన్ని శాఖల ఫైల్స్ సర్క్యూలేట్ కు ఆగస్టు- 15 డెడ్ లైన్.
3rd జులై నుండి ఎంపిక చేయబడిన
16 శాఖల తో ఈ ఆఫీస్ ప్రారంభించబడుతుంది.
ఈ.ఆఫీస్ ద్వారా అన్ని వివిధ శాఖలకు సంబంధించి ఫైల్స్ పంపించాలి.
మెదక్ జిల్లా సమర్థవంతమైన పాలనకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రజావాణి అనంతరం అధికారులకు సమావేశం ద్వారా పలు ఆదేశాలు జారి.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయాలంటే మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి అనంతరం అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు
క్షేత్రస్థాయిలో వారి వారి శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలు అందించడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని,ఇందుకుగాను క్షేత్రస్థాయి అధికారులు సమయపాలన తప్పనిసరి అని డివిజనల్ స్థాయి,మండల స్థాయి అధికారులు
మన పని విధానంపై ఆత్మ పరిశీలనచేసుకోవాలన్నారు క్షేత్రస్థాయి అధికారుల పర్యటనలు ప్రత్యేకంగా ప్రొఫార్మా ఇవ్వడం జరుగుతుందని రేపు సాయంత్రం వరకు ఈ ప్రొఫార్మా నింపి అందించాలని చెప్పారు.
క్షేత్రస్థాయి పర్యటన అధికారులు టూర్ డైరీ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలన్నారు. చెప్పారు.ముఖ్యంగా ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో కనపడటం లేదని గుర్తించడం జరిగిందన్నారు.సోమవారం మినహా మిగతా రోజులన్నీ నేను క్షేత్రస్థాయి పర్యటనలోనే ఉంటానని ఏ ఒక్క అధికారి అయిన విధులు పట్ల అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలోప్లాస్టిక్ రహితంగా మార్చేందుకుపగడ్బందీగా చర్యలు చేపట్టామని ఇందుకుగాను
వాటర్ బాటిల్స్ ద్వారానీటి సరఫరా చేయకుండా కలెక్టరేట్ లోనే ప్రత్యేక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సరఫరా చేసే విధంగాచర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ప్రతి కార్యాలయంలో ప్రత్యేకంగా కొనుగోలు చేసిన స్టీల్,గ్లాస్ వాటర్ బాటిల్స్ఉంచుకోవాలని వాటి ద్వారా వాటర్ ప్లాంట్ నుండి నీటిని తీసుకుని వెళ్లి సేవించాలన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వివరించారు.
ప్రతి ఫైలు కూడా ఈ ఆఫీస్ ద్వారా స్కాన్ చేసి భద్రపరచడమే కాకుండా నూతన ఫైల్స్ కూడా ఈ ఆఫీస్ ద్వారానే రావాలని నిబంధనలు విధించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలోకలెక్టరేట్ ఏవో యూనస్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరామ్,డి ఆర్ డి ఎ పి డి శ్రీనివాసరావు,జిల్లా సంక్షేమ అధికారి
బ్రహ్మాజీ,వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి విజయలక్ష్మి,సంబంధిత అధికారులుపాల్గొన్నారు.