సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి
తేది – 29.06.2024.
చిన్నారుల మొహంలో చిరునవ్వులు చిందించేలా చేద్దాం .
నిస్సహాయత లేని చిరునవ్వులే మన లక్ష్యం
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలి.
ఆపరేషన్ ముస్కాన్- X నిర్వహణ గురించి సమీక్ష సమావేశం
చిన్న పిల్లల్ని ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు
బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో సమాజంలోని ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలి
సమన్వయంతో పనిచేసి చిన్నారులను బాల్యాన్ని కాపాడుదాం.జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో జూలై 1 నుండి 31-07-2024 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ ముస్కాన్-X లో జిల్లా పోలీస్ బృందం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారులు మరియు సిబ్బందితో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ… బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో సమాజంలోని ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలని, అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్చంధ సంస్థలు సమన్వయంతో కలిసి పనిచేసి వెట్టిచాకిరీ నుండి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడుకుందామని అన్నారు.
18 సంవత్సరాల లోపు తప్పిపోయిన, వివిధ రకాల బాలకార్మికులు వారు గొర్రెల, పశువుల కాపరులుగా, కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ మరియు వదిలివేయబడిన పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నపిల్లలు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందిని చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాట మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా జిల్లాలోని రెండు సబ్ డివిజన్ లకు గాను రెండు ఆపరేషన్ ముస్కాన్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు.
వీరితో పాటు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు. బాలకార్మికులుగా పట్టుకున్న పిల్లలను స్టేట్ హోమ్ కు పంపించే ముందు జిల్లా మెడికల్ అధికారులతో వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి సమిష్టిగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి డిపార్ట్మెంట్ సంయుక్తంగా సమన్వయంతో విధులు నిర్వర్తించి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఎస్పీతెలిపారు. చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. ప్రజలు ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న, లేక వారితో బలవంతంగా పని చేయించిన, ఒంటరిగా బాధపడుతున్న బాలలను చూసినప్పుడు, ఆశ్రయం అవసరమైన, తప్పిపోయిన మరియు వదిలి వేయబడిన బాలలను చూసినప్పుడు, శారీరకంగా మానసిక మరియు లైంగిక దోపిడికి గురవుతున్న బాలలను చూసినప్పుడు, ఆర్థికంగా దోపిడీకి గురవుతున్న బాలకార్మికులను చూసినప్పుడు, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100, 112 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పిశ్రీ.ఎస్.మహేందర్, డి.ఈ.ఓ.రాధాకిషన్ ,శ్రీమతి.రమాదేవి మెదక్ ఆర్.డి.ఓ జయ చంద్రారెడ్డి తూప్రాన్ ఆర్.డి.ఓ ,డాక్టర్ నవీన్ ఏవో DMHOశ్రీ.సత్యేంద్ర ప్రసాద్ ఏ.ఎల్.వో, శ్రీ.రాజు ఏ.ఎల్.వో,శ్రీమతి కరుణశీల డిసిపిఓ, శ్రీ.శ్రీనివాసరావు ఎస్.డబ్ల్యు-డీసీపీడబ్ల్యూ,శంకర్ గౌడ్ WCD వెంకట్ రామ్ రెడ్డి,బాల్ నర్సింలు గారు,శ్రీ.ఉప్పలయ్య, ch.నాగరాజు, సి.హెచ్ సతీష్ కుమార్ కార్పెడ్ NG O.కలీద్ పంచాయత్ రాజ్ శాఖ,ఎస్.ఐ శ్రీ.విఠల్,ఎస్.ఐ శ్రీ.శ్రీనివాస్.జి.నాగరాజు గారు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.