సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్)
తేది 29.6.2024.
ఉద్యోగి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజం..
పదవి విరమణ పొందుతున్నయం.రవి హెడ్ కానిస్టేబుల్ కి ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా ఎస్.పి డా.బి. బాలస్వామి ఐ.పి.ఎస్
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో జిల్లా ఎస్.పి. డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ.. 1989 లో పోలీసు శాఖలో ఎ.ఆర్ పోలీసు కానిస్టేబుల్ నియామకమై, 35 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు ఇచ్చిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందారని, తాను మక్తమాసాన్పల్లి, సంగారెడ్డి రూరల్, చరాక్పల్లి, కంగ్జి, కోహిర్, వెల్దుర్తి, టేక్మాల్ ప్రస్తుతము రేగోడ్ పోలీస్ స్టేషన్ లలో వారందించిన సేవలకు గాను సేవా పతకం, కాష్ రివార్డ్స్ అందుకోవడం జరిగింది. సర్వీస్ మొత్తంలో ఎ చిన్న రిమార్క్ లేకుండా అంచలంచాలుగా పదోన్నతి పొంది సివిల్ హెడ్ కానిస్టేబుల్ గా ఈ రోజు పదవి విరమణ చేస్తున్నారని అన్నారు. వారు పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివని వారి సేవలను కొనియాడారు.
రిటైర్మెంట్ అనంతరం పోలీసు శాఖ నుండి రావలసిన అన్నిరకాల రిటైర్మెంట్ బెన్ఫిట్స్ సకాలంలో అందేవిధంగా చూస్తామన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మిగిలిన శేష జీవితం అతని కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అన్నారు. పోలీస్ శాఖ తరపున మీకు, మీ కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ, సహకారం అందింస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్. ఎస్.మహేందర్ గారు, AO శ్రీమతి. లక్ష్మిలావణ్యలతా,
సూపరింటెండెంట్ వలియా,ఎస్.బి.సిఐ. సందీప్ రెడ్డి, అల్లాదుర్గ్ సిఐ.శ్రీమతి రేణుకా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.