Reporter -Silver Rajesh Medak.
తేదీ 25-6-2024
వ్యాధుల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని
వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు.
మంగళవారం మెదక్ జిల్లా రేగోడు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు ముందుగా సిబ్బంది హాజరు పట్టిక,ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు
తదితర విషయాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం
అందించే విధంగా దృష్టి సారించాలని
వ్యాధులు కాలాన్ని దృష్టిలో పెట్టుకునివాటికి అవసరమైన మందులుఅందుబాటులో ఉంచుకోవాలని,మలేరియా, డెంగ్యూ
వ్యాధుల నుండి ప్రజలను రక్షించడానికి పరిసరాల పరిశుభ్రత వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు,సిబ్బంది అందుబాటులో ఉండాలని,ఆసుపత్రుల్లోనే ప్రసవాలు
జరగాలని,ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.మెదక్ జిల్లా ఆసుపత్రుల పనితీరును మెరుగుపరిచి ప్రజల విశ్వాసాన్ని చూడగొనాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట వైద్యాధికారులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.