అంగన్ వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు

Reporter -Silver Rajesh Medak.
తేది – 25/6/2024

అంగన్ వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు…… రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ

*ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్

*త్రాగునీరు, టాయిలెట్, విద్యుత్ మొదలగు మౌలిక వసతుల కల్పన

*జూలై మొదటి వారం నాటికి అంగన్వాడి టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య బోధనపై శిక్షణ పూర్తి

*పిల్లల పోషక లోపాల నివారణ కట్టుదిట్టమైన చర్యలు

*పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలుగా అంగన్ వాడి సెంటర్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి

అంగన్ వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు.
మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అంగన్ వాడి కేంద్రాల అభివృద్ధి పై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ గత 5 నుంచి 6 సంవత్సరాలుగా పిల్లల సంక్షేమం కోసం కృషిచేసిన ప్రముఖమైన స్వచ్ఛంద సంస్థల సహకారంతో అంగన్ వాడి సెంటర్ల అభివృద్ధి కార్యాచరణ, పిల్లలకు నేర్పాల్సిన పాఠ్యాంశాలు, పిల్లల అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యల ప్రణాళిక రూపొందించామని అన్నారు.

జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని చిన్న వయసులో పిల్లలకు నేర్పాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత, అంశాలు, నైపుణ్యాలతో కోర్సు సిద్దం చేశామని, అంగన్ వాడి సెంటర్లలో పిల్లలకు నేర్పించాల్సిన అంశాల ను వివరిస్తూ అంగన్ వాడి టీచర్లకు ప్రత్యేక బుక్ లెట్ రూపొందించామని, జూలై మొదటి వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడి టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య పై శిక్షణ పూర్తి చేయాలని కలెక్టర్ లకు ఆమె సూచించారు.

ప్రతి అంగన్ వాడి సెంటర్ లో ప్లే మ్యాట్ ఏర్పాటు చేయాలని, దీనిని రాష్ట్ర స్థాయి నుంచి అందించడం జరుగుతుందని, అదే విధంగా జిల్లా స్థాయిలో సంక్షేమ శాఖ వద్ద అందుబాటులో ఉన్న నిధులతో ప్రతి అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్ వేయించాలని అన్నారు.

అంగన్ వాడి కేంద్రాలలో సివిల్ వర్క్స్ కోసం మంజూరు చేసిన నిధులను వినియోగించుకుంటూ ప్రతి అంగన్ వాడి కేంద్రంలో త్రాగు నీరు, అవసరమైన మేర టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్ మరమ్మత్తు మొదలగు పనులు పూర్తి చేయాలని అన్నారు.
జిల్లా స్థాయిలో జరుగుతున్న అంగన్ వాడి శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, అంగన్ వాడి కేంద్రాలలో ఉన్న పిల్లలకు ఏక రూప దుస్తులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

జూలై నెలలో అంగన్ వాడి పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, అప్పటి వరకు నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని అన్నారు.
చిన్నపిల్లల్లో పోషక లోపాల నివారణకు కట్టెదటమైన చర్యలు తీసుకోవాలని, ముందస్తుగా పోషక లోపం గల పిల్లలను అంగన్ వాడి టీచర్ల ద్వారా గుర్తించాలని అన్నారు.

ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో ఉన్న అంగన్ వాడి టీచర్లు వారి పరిధిలో ఉన్న పిల్లల ఎదుగుదల గణనించాలని, అవసరమైన వారికి అదనపు పౌష్టికాహారం, పోషకాలు అందించాలని అన్నారు. గ్రామాలలో, పట్టణాలలో ఉన్న 1 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్ వాడి కేంద్రాలలో రిజిస్టర్ చేయించి వారికి రెగ్యులర్ గా పౌష్టికాహారం అందించాలని అన్నారు.

అంగన్ వాడి కేంద్రాలలో ఉన్న పిల్లల ఎదుగుదల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, వయసుకు తగిన బరువు ఎత్తు లేని పిల్లలను గుర్తించాలని, పిల్లల లో ఉన్న ఎదుగుదల, మానసిక సమస్యలను ముందస్తుగా గుర్తిస్తే వాటిని త్వరితగతిన పరిష్కరించె అవకాశం ఉంటుందని అన్నారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు దివ్యాంగ సర్టిఫికెట్ త్వరితగతిన అందించేందుకు సదరం క్యాంపులలో అవసరమైన మేర స్లాట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

వృద్ధుల సంక్షేమం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 14567 ద్వారా జిల్లాలో ఎవరైనా వయోవృద్ధులు వారి పిల్లలు- సంతానము లేదా వారసులు సరిగ్గా చూసుకోనట్లయితే, వారి సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహించినట్లయితే, వారికి అందాల్సిన కనీస అవసరాలతో పాటు జీవించే హక్కును కాలరాయడం, దుర్భాషలాడడం భౌతిక హింస ,శారీరక, మానసిక హింసలకు గురి చేసినట్లయితే వారిపై చట్టరీత్యా తగు చర్యలు జైలు శిక్ష మరియు జరిమానా విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా సూచించడం జరిగింది.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ

జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని చిన్న వయసులో పిల్లలకు నేర్పాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత, అంశాలు, నైపుణ్యాలతో కోర్సు ను, అంగన్ వాడి సెంటర్లలో పిల్లలకు నేర్పించాల్సిన అంశాల ను వివరిస్తూ అంగన్ వాడి టీచర్లకు ప్రత్యేక బుక్ లెట్ రూపొందించిన, జూలై మొదటి వారం నాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడి టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య పై శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ప్రతి అంగన్ వాడి సెంటర్ లో ప్లే మ్యాట్ ఏర్పాటు చేయాలని,జిల్లా స్థాయిలో సంక్షేమ శాఖ వద్ద అందుబాటులో ఉన్న నిధులతో ప్రతి అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్, వేయించాలని అన్నారు. ప్రతి అంగన్ వాడి కేంద్రంలో త్రాగు నీరు, అవసరమైన మేర టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్ మరమ్మత్తు మొదలగు పనులు పూర్తి చేయాలని అన్నారు.
జిల్లా స్థాయిలో జరుగుతున్న అంగన్ వాడి శిక్షణ కార్యక్రమాలను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, అంగన్ వాడి కేంద్రాలలో ఉన్న పిల్లలకు ఏక రూప దుస్తులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

జూలై నెలలో అంగన్ వాడి పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, అప్పటి వరకు నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని అన్నారు.
చిన్నపిల్లల్లో పోషక లోపాల నివారణకు కట్టెదటమైన చర్యలు తీసుకోవాలని, ముందస్తుగా పోషక లోపం గల పిల్లలను అంగన్ వాడి టీచర్ల ద్వారా గుర్తించాలని అన్నారు.

ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో ఉన్న అంగన్ వాడి టీచర్లు వారి పరిధిలో ఉన్న పిల్లల ఎదుగుదల గణనించాలని, అవసరమైన వారికి అదనపు పౌష్టికాహారం, పోషకాలు అందించాలని అన్నారు. గ్రామాలలో, పట్టణాలలో ఉన్న 1 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్ వాడి కేంద్రాలలో రిజిస్టర్ చేయించి వారికి రెగ్యులర్ గా పౌష్టికాహారం అందించాలని అన్నారు.
అంగన్ వాడి కేంద్రాలలో ఉన్న పిల్లల ఎదుగుదల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, వయసుకు తగిన బరువు ఎత్తు లేని పిల్లలను గుర్తించాలని, పిల్లల లో ఉన్న ఎదుగుదల, మానసిక సమస్యలను ముందస్తుగా గుర్తిస్తే వాటిని త్వరితగతిన పరిష్కరించె అవకాశం ఉంటుందని అన్నారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు దివ్యాంగ సర్టిఫికెట్ త్వరితగతిన అందించేందుకు సదరం క్యాంపులలో అవసరమైన మేర స్లాట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

వృద్ధుల సంక్షేమం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 14567 ద్వారా జిల్లాలో ఎవరైనా వయోవృద్ధులు వారి పిల్లలు- సంతానము లేదా వారసులు సరిగ్గా చూసుకోనట్లయితే, వారి సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహించినట్లయితే, వారికి అందాల్సిన కనీస అవసరాలతో పాటు జీవించే హక్కును కాలరాయడం, దుర్భాషలాడడం భౌతిక హింస ,శారీరక, మానసిక హింసలకు గురి చేసినట్లయితే వారిపై చట్టరీత్యా తగు చర్యలు జైలు శిక్ష మరియు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సంక్షేమ అధికారి, బ్రహ్మాజీ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నరు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!