Surendar navipet: సురేందర్ నవీపేట్ రిపోర్టార్
స్టూడియో10టీవీ
అయోధ్య ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యం: గర్భగుడిలోకి నీరు
ఉత్తర ప్రదేశ్:జూన్ 25
భారీ వర్షాలతో అయోధ్య రామమందిరం లీకేజీపై ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరిలో ప్రారంభించిన ఆలయ ప్రధాన భవనం లీకేజీ గురైనట్లు తెలిపారు.
రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా అయోధ్య రామాలయంలో లీకేజీ జరిగిందని ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పడంతో వివాదం చెలరేగుతోంది.
ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి లీక్ గురించి వెల్లడించారు. నీరు వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేదని, భారీ వర్షాలు కురిస్తే చూడ్డానికి ఇబ్బందిగా మారుతుందని సత్యేంద్ర దాస్ అన్నారు.
ఈ నేపథ్యంలో అయోధ్య ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ విషయంపై స్పందించారు. గురు మండపం బహిరంగ ప్రదేశంలో ఉండడమే దీనికి కారణమని నృపేంద్ర మిశ్రా తెలిపారు.
నిర్మాణం పూర్తయితే సమ స్య పరిష్కారమవు తుంద న్నారు.మొదటి అంతస్తులో లీకేజీని గుర్తించామని, మొదటి అంతస్తు నిర్మాణం లో ఉందని మిశ్రా వివరిం చారు.
నిర్మాణంలో కానీ, డిజైన్‌లో కానీ ఎలాంటి సమస్యలు లేవని నృపేంద్ర మిశ్రా వివరించారు.
[9:57 pm, 25/6/2024] Surendar navipet: End నవీపేట్ రిపోర్టార్
[10:46 pm, 25/6/2024] Surendar navipet: జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ : జూన్ 25
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం జరి గింది. రోడ్ నంబర్ 82లోని ఓ బహుళ అంతస్తు భవ నంలో ఈరోజు మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.
జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో.. స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గుర య్యారు.
అయితే.. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడం తో.. పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలను చూసిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు.
కాగా.. ఈ ప్రమాదంపై వెంట నే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.
అయితే.. ఇంకా భవనం లోపల, పార్కింగ్, స్టోర్ రూం నుండి పొగలు వస్తున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరోవైపు.. నిబంధనలకు విరుద్ధంగా భవనం ఓనర్స్ పార్కింగ్ను.. స్టోర్ రూమ్గా వాడుతున్నారు. అందువల్ల నే మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికా రులు చెబుతున్నారు.
మొత్తానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని అధికారులు వెల్లడించారు