రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 25:- రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా నేరుగా రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలచే అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు నేస్తం కార్యక్రమం పేరుపైన ప్రతి మంగళవారం రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుందని మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం రోజు వానాకాలంలో వివిధ పంటల సాగు విధానం చీడపీడల నివారణ ఎరువుల యాజమాన్యం వంటి అంశాలపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వారిచే వివిధ యూట్యూబ్ వీడియోలను ప్రదర్శించడం జరిగిందన్నారు. రైతులతో నేరుగా చర్చించి వారి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వానాకాలం సాగుకు సంబంధించి తొలి దశలో ఖర్చులకు సంబంధించి విత్తన మరియు ఎరువులు పురుగుమందుల యజమాన్యం నిమిత్తం రైతుకు ఆర్థికంగా సహాయం అందించే విధంగా రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆర్థిక చేయూత అందించే ఉద్దేశంతో రాష్ట్రస్థాయిలో విధివిధానాలను రూపొందిస్తున్నారు.అందులో భాగంగా ప్రధమంగా నేరుగా క్షేత్రస్థాయిలోని రైతుల అభిప్రాయాలను సేకరించి ఏ విధంగా రైతు భరోసా కార్యక్రమం కింద ఆర్థిక చేయూతనిస్తే ఎక్కువ మంది రైతులకు లాభాలు చేకూరుతాయో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే ఎక్కువ రైతులకు లబ్ధి చేకూతుందో వంటి అంశాలను క్షేత్రస్థాయిలోని రైతులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి రైతు వేదిక లో ఈ సమావేశానికి హాజరైనటువంటి రైతుల యొక్క అభిప్రాయాలను రాత పూర్వకంగా సేకరించి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలని క్షేత్రస్థాయిలో పని చేస్తున్నటువంటి జిల్లా వ్యవసాయ అధికారి సహాయ వ్యవసాయ సంచాలకులు మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణ మండల వ్యవసాయ అధికారులు రాజ్ నారాయణ హరిప్రసాద్ టెక్నికల్ వ్యవసాయ అధికారి సతీష్ మరియు రామాయంపేట డివిజన్ చెందిన రైతులు మరియు వ్యవసాయ విస్తీర్ణాధికారులు పాల్గొన్నారు.