మైనింగ్ జోను ఏర్పాటును విరమించుకోవాలి

🔥పత్రిక ప్రచురణార్ధం👇


మైనింగ్ జోను ఏర్పాటును విరమించుకోవాలి


చేవెళ్ల, జూన్23 : చేవెళ్ల మండలంలోని అంతారం గ్రామ పరిధిలో పంచలింగాల గుట్ట దగ్గర ఈనెల 27వ తేదీన పర్యావరణ అనుమతుల కోసం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని ఆ గ్రామ ప్రజలు ఏకపక్షంగా తీర్మానం చేశారు. ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. అంతారం రెవెన్యూ సర్వే నెంబర్ 185 లో ఎస్ఆర్ మినరల్స్ మైనింగ్ తవ్వకాల ప్రతిపాదనలను రద్దు చేయాలని, పర్యావరణ అనుమతుల కోసం జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణను విరమించుకోవాలని గ్రామసభలో సంతకాల సేకరణ నిర్వహించి మాట్లాడారు. మైనింగ్ వల్ల జరిగే దుష్పరిమాణాలను గ్రామస్తులంతా వివరించుకున్నారు. మైనింగ్ తవ్వకాల కోసం నిర్వహించబోయే ప్రజాభిప్రాయ సేకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు గ్రామస్తులంతా తీర్మానం చేశారు. మైనింగ్ ఏర్పాటు చేస్తే పర్యావరణానికి, పంటపొలాలకు, వన్యప్రాణులకు నష్టం వాటిల్లితుందని, ఆ ప్రాంతమంతా విషతుల్యం కానుందన్నారు. ప్రజలకు నష్టం వాటిల్లే మైనింగ్ ను గ్రామంలో ఏర్పాటు చేయోద్దంటూ ముక్తకంఠంతో చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే ఇప్పటికే కొనసాగుతున్న మైనింగ్ అనుమతులు వెంటనే రద్దు చేయాలన్నారు. పచ్చని పంట పొలాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న మైనింగ్ తో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. మైనింగ్ జరిగే ప్రాంతం చుట్టూ పక్కల దుమ్ము, ధూళి చేలరేగడంతో పశుగ్రాసం దెబ్బతింటుందని, మూగ జీవాలు రోగాల బారిన పడే అవకాశం ఉంటుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. మైనింగ్ ఏర్పాటు చేస్తే పర్యావరణానికి, పంటపొలాలకు, వన్యప్రాణులను నష్టం వాటిల్లుతుందన్నారు. అదే కాకుండా మైనింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న సహజసంపదను కోల్పోతామని అన్నారు. మైనింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ జరిగే పనుల వల్ల దుమ్ము, ధూళి చెలరేగడంతో, ఆ ప్రాంతమంతా విషతుల్యమై సమీప గ్రామ ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, అస్తమా‌, క్యాన్సర్ తదితర రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మైనింగ్ తవ్వకాలతో భవిష్యత్తులో గ్రామం ముంపునకు గురయ్యే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


పశువులకు మేత కరువు


మైనింగ్ ప్రాంతానికి దగ్గరలో గల అంతారం, హస్తేపూర్, మిర్జాపూర్, గిరిజన తండా, కండ్లపల్లి గ్రామాలకు చెందిన ఎంతోమంది రైతులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నారని, ఇప్పటికే అంతారం గ్రామంలోని 185 సర్వే నెంబర్ లో సుమారు 54 ఎకరాలలో కొనసాగుతున్న మైనింగ్ వల్ల పశువులకు మేత దొరకకపోగా, మళ్లీ అదే 185 సర్వే నెంబర్ లో కొత్తగా సుమారు 27 ఎకరాల్లో మైనింగ్ పనులు చేపడితే మూగ జీవాలకు మేత దొరకడం కష్టమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ ఏర్పాటు విషయంలో అధికారులు తమ గోడును వినిపించుకొని మైనింగ్ ఏర్పాటు కోసం నిర్వహించబోయే ప్రజాభిప్రాయ సేకరణను విరమించుకోవాలని‌, అదేవిధంగా ఇప్పటికే అనుమతులిచ్చిన మైనింగ్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని, కలెక్టరేట్ ను ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సులోచన అంజన్ గౌడ్, పోస్టి మాణిక్యం, వీరాస్వామి, ఎల్లయ్య, ఆంజనేయులు, నరేందర్, సత్యనారాయణ, శ్రీశైలం, చాకలి సుధాకర్, చాకలి కుమార్, జుట్టు సుధాకర్, వీరాంజనేయులు, లక్ష్మీనారాయణ, అనంతయ్య, ఆంజనేయులు, పర్మయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!