రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 23:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనసంగ్ అలాగే కాలక్రమేపి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగిందన్నారు.ఆయన సూచించిన మార్గ నిర్దేశనుసరం ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఇప్పటికీ ఆయన ఆలోచనలను పార్టీలో కొనసాగించడం జరుగుతుందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భానుచందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి శీలం అవినాష్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర సీనియర్ నాయకులు వెలుముల సిద్ధరాములు, చింతల శేఖర్, భూత్ ఇంచార్జ్ లు నాగరాజు, కన్నయ్య, దోమకొండ శ్రీనివాస్, అక్కల అనిల్, మహేష్, నరేష్ యాదవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.