ప్రజాపాలన కేంద్రాలను ఉపయోగించుకోవాలి… — జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు

సిల్వర్ రాజేష్ (స్టూడియో 10టీవీ ప్రతినిధి)మెదక్

తేదీ 22-6-2024

ప్రజాపాలన కేంద్రాలను ఉపయోగించుకోవాలి… — జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు


ఎన్నికల కోడ్ సందర్భంగా నిలిపివేసిన ప్రజా పాలన సేవా కేంద్రాలు పునః ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు తెలిపారు.
శనివారం మెదక్ జిల్లాచేగుంట ఎంపీడీవో కార్యాలయంలో గల ప్రజా పాలన సేవా కేంద్రాలను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆగిపోయిన ప్రజాపాలన కేంద్రాలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజాపాలన కేంద్రాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
స్థానిక ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలలో ఉన్న సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.ఈ ప్రజా పాలన సేవా కేంద్రాలలో గతంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులలో తప్పొప్పులు ఉన్నట్లయితే ఈ సేవా కేంద్రాల ద్వారా సరిదిద్దుకోవాలని
తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంట చేగుంట మండల అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!