సిల్వర్ రాజేష్ (స్టూడియో 10టీవీ ప్రతినిధి)మెదక్
తేదీ 22-6-2024
మెదక్ జిల్లా
రెవిన్యూ అధికారులు సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
చేగుంట తాసిల్దార్ పై క్రమశిక్షణ చర్యలు
క్షేత్రస్థాయిలో తాసిల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా పరిశీలించిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేగుంట,చిన్న శంకరంపేట
తాసిల్దార్ కార్యాలయాలను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగాపరిశీలించారు. చేగుంట తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్,డి.టి
విధులకు హాజరు కాలేదని సిబ్బంది ద్వారా తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగారెవిన్యూ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేస్తూ సమయపాలన,విధుల యందు క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.
చిన్న శంకరంపేట తాసిల్దార్ కార్యాలయం పరిశీలించగా అధికారులు సిబ్బంది అందరూ విధులు క్రమశిక్షణగా నిర్వహించడంతో వారిని అభినందించారు. తాసిల్దార్ కార్యాలయం ద్వారా ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు.