సిల్వర్ రాజేష్ (స్టూడియో 10టివి ప్రతినిధి)మెదక్
తేది -22/6/2024.
మిషన్ భగీరథ ఇంటింటా సర్వే 97%పూర్తి .
రాబోవు రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేయాలి.
క్షేత్రస్థాయిలో సర్వే విధానాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలి.
మిషన్ భగీరథ ఇంటింటా సర్వే పై ఎంపీడీవోలు ,ఎం.పీ ఓ మిషన్ భగీరథ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించిన కలెక్టర్
జిల్లాలోని మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ లపై ఇంటింటి సర్వేలో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలిఅని
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మెదక్ జిల్లా మిషన్ భగీరథ. నల్లా కనెక్షన్ల పై ఇంటింటా సర్వే నిర్వహణ తీరును సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న మిషన్ భగీరథ నల్లాల సర్వే మండలాల వారిగా ప్రణాళిక బద్ధంగా ఈ సర్వే అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు ప్రతి ఇంటికి అందాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాలు కలవని. తాగు సరఫరా లేని ఆవాసాలు, ప్రాంతాలు, ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వేను ప్రారంభించిందని దీన్ని క్షేత్రస్థాయిలో నిర్దేశిత గడువు తేదీలోగా పూర్తిచేసే దిశగా బాధ్యతగా పనిచేయాలన్నారు.
ఈ గూగుల్ మీట్ లో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య,సంబంధిత ఎంపీడీవోలు,ఎంపిఓలు,మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.