రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రకటనపై హర్షం వ్యక్తపరిచిన నాయకులు
మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ మరియు గరిగే నర్సింగరావు డాక్టర్అప్సర్ గారు మాట్లాడుతూ.. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్నటి రోజున క్యాబినెట్ సమావేశంలో రైతులకు పంట రుణాలను రెండు లక్షల రుణమాఫీ ప్రకటన చేసినందుకు తెలంగాణ రైతులందరూ తరపున మరియు మెదక్ జిల్లా & సిద్దిపేట జిల్లా రైతుల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమై రైతులను నిలువు దోపిడి చేసినట్లుగా వ్యవహరించారు గత ప్రభుత్వము మాఫీ చేస్తామని మాఫీ చేస్తామని అనడం వలన రైతులు బ్యాంకులకు వెళ్లలేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంఘటనలు చూసాము అటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో రావని ఆశిస్తున్నాము కావున ఏకకాలంలో ఎలాంటి కొర్రీలు పెట్టకుండా సాగు చేసినటువంటి రైతులకు పంట రుణాలను మాఫీ చేసి తెలంగాణ రైతులను ఆదుకోవాలని సిద్దిపేట జిల్లా పక్షాన కోరుతున్నాము అలాగే రైతు భరోసా కూడా వాస్తవముగా సాగు చేసినటువంటి రైతులకు ఐదు నుంచి పది ఎకరాల వరకు పరిమితి విధించి రైతు భరోసా కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జిల్లా రైతులు పేరుపేరునా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపునైనది. జైహింద్ జై తెలంగాణ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల వెంకటరెడ్డి. దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.