ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం విద్యార్థిని విద్యార్థులతో యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగ గురించి మండల విద్యాశాఖ అధికారి బి మస్తాన్ నాయక్ మాట్లాడుతూ… ప్రతినిత్యం మన దైనందిక జీవితంలోయోగా చేయడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయి. యోగా సాధన తో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఎం. ఈ. ఓ. మస్తా నాయక్ పేర్కొన్నారు.శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఉన్నత పాఠశాలలో . నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టిడిపి మండల కన్వీనర్ ఏరువా మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ… జ్యోతి ప్రజ్వలన కావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకుంటామని ఇందులో భాగంగా మన ఉన్నత పాఠశాలలో నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ….యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఆధ్యాత్మిక, ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పారు. యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి. బిజెపిఅధ్యక్షులు సురవరంగడ్డి వీరారెడ్డి. ఉపాధ్యాయులు.
తదితరులు పాల్గొన్నారు.