రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు డిజి. శ్రీనివాస శర్మ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నాడు ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఉషా హరి కన్వెన్షన్ హాల్లో టియుడబ్ల్యూజే రాష్ట్రస్థాయి తృతీయ మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో సభ్యులందరు కలిసి రాష్ట్రస్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టి యూడబ్ల్యూజే. రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా విరాహత్ అలీ ఎన్నికయ్యారు.ఈయన క్యాబినెట్లో మెదక్ ప్రాంతం నుండి శ్రీనివాస శర్మకు మరో మారు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా అవకాశం దక్కింది. తనపై నమ్మకం ఉంచి మరోమారు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా అవకాశం కల్పించిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విరాహాత్ అలీ కి శర్మ కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఎన్నికల్లో తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి కి, ప్రధాన కార్యదర్శి సంతోష్ కు, ఐ జె యు నేషనల్ కౌన్సిల్ సభ్యుడు బుక్క అశోక్ లకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మెదక్ జిల్లాలో యూనియన్ ను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని శ్రీనివాస శర్మ తెలిపారు.