యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం —అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

Reporter -Silver Rajesh Medak.

తేది -21/6/2024.

యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం —అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ప్రతినిత్యం మన దైనందిక జీవితంలో
యోగా చేయడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయి.

యోగా సాధన తో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా యువజన మరియు క్రీడా శాఖ, శ్రీ వశిష్ట యోగా కేంద్రం సంయుక్తంగా మెదక్ స్టేడియం లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన కావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకుంటామని ఇందులో భాగంగా మన జిల్లాలో స్టేడియం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఆధ్యాత్మిక, ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పారు. యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అన్నారు.

అనంతరం యోగా గురువు రవి నాయక్ ద్వారా యోగాలో ఉన్న అన్ని అంశాలను సాధన చేశారు.

యోగ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు , యోగా గురువులు రవి, దామోదర్ రెడ్డి , బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ చంద్ర గౌడ్ ,డిగ్రీ కళాశాల అధ్యాపకులు , సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు ఆనందం, నెహ్రు యువ కేంద్ర కోఆర్డినేటర్ కిరణ్ ఫుట్బాల్ ,అథ్లెటిక్స్ క్రీడాకారులు, సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు ,వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఉద్యోగులు ఆయుష్ బృందం వివిధ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!