Studio 10TV ప్రతినిధి (సిల్వర్ రాజేష్)
తేదీ 19-6-2024, మెదక్ జిల్లా
మహిళాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ
మహిళల అభ్యున్నతే ప్రభుత్వా లక్ష్యం అని ,పేద ఆడ పిల్లలకు వరం కళ్యాణ లక్ష్మి అని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ అన్నారు.
నర్సాపూర్ నియోజక వర్గ పరిధిలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , అదరపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , ప్రజా ప్రతినిధులతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల యొక్క వివాహం ఇకపై కుటుంటానికి భారం కాకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం, షాది ముబారక్ పథకం అని గొప్ప పధకాన్ని అమలు చేస్తుందని, ఈ పథకం కొన్ని అర్హత ప్రమాణాలతో పెళ్లి సందర్భంగా వదువుకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఇట్టి నగదు ప్రోత్సాహకు వదువు తల్లి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది, తద్వారా వధువు వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతుందన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకం పేద ,ముస్లిం మైనారిటీ కుటుంబాల వదువుల ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 18 ఏళ్లు నిండిన లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు మాత్రమే కళ్యాణ లక్ష్మి పథకం షాది ముబారక్ పథకములకు దరఖాస్తు చేసుకోవచని ,ఇది బాల్య వివాహాలను నిర్మూలించడానికి, బాలికలలో అక్షరాస్యతను పెంపొందించడానికి సహాయపడుతుందన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ పథకం వల్ల మహిళలు సాధికారత మరియు ఆర్థిక స్వాతంత్యం పొందుతారాన్నారన్నారు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు రూ.100116/- ఆర్థిక సహాయం లబ్ది పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ,రాజకీయ నాయకులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.