స్టూడియో 10 టీవీ ప్రతినిధి (సిల్వర్ రాజేష్)
తేదీ 19-6-2024, మెదక్ జిల్లా
బడిబాట పై కలెక్టర్ పాట
సొంతగా రాసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పలువురి ప్రశంసలు
సర్కారు బడి పై ప్రేమ… పేద పిల్లల చదువులపై మక్కువ
మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ ఎంఎల్ఏ సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ
స్థానిక నర్సాపూర్ నియోజకవర్గంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో బుదవారం జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ,నర్సాపూర్ ఎంఎల్ఏ సునీత లక్ష్మారెడ్డి లు కళ్యాణ లక్ష్మి,షాది ముబారాక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో మెదక్ జిల్లా కలెక్టర్ తన స్వహస్తాలతో రాసిన చిట్టి.. పోట్టి అడుగులు …. అనే పాటను ఆవిష్కరించారు. సర్కారు బడి పై ప్రేమ, పేద పిల్లల పై మక్కువ తో ఈ పాట స్వయంగా రాసి, కూర్పు చేసి, ట్యూన్స్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను అభినందించారు. ఈ వినూత్న గా రాసిన పాటను ప్రజలు పిల్లలు తప్పకుండా ఆదరిస్తారని, మెదక్ కలెక్టర్ ఒక గొప్ప ఆశయం కోసం పరితపిస్తున్నడని అది తప్పక నెరవేరుతుందని. ఈ పాట ద్వారా ప్రజల్లో మంచి చైతన్యం కల్పించారని ,తల్లి తండ్రుల వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపిస్తారని అన్నారు.