Reporter -Silver Rajesh Medak.
తేది -16/06/2024.
శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే… ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు
- స్వార్థం కోసం రాజకీయాలను వాడుకోవడం మానుకోవాలి
- ప్రభుత్వ, ప్రవేటు ఆస్తులను ధ్వంసం చేసి ప్రజలను భయాందోళనకు గురిచేశారు
- ప్రజలందరు సుఖశాంతులతో నల్లపోచమ్మ జాతర, బక్రీద్ పండుగను నిర్వహించుకోవాలి
- యువతరం దేశానికి ఆదర్శంగా నిలవాలి
- స్వార్థ రాజకీయాల్లో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు
- మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
- శాంతి భద్రతలపై డిజిపి, ఐజిలతో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే
……………………………………………………….
శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే… ఎంతటి వారినైనా ఊరుకునే ప్రసక్తే లేదని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. ఆదివారం ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అధికారులతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మతసామరస్యాలకు ప్రతీకగా నిలిచిన మెదక్ ప్రాంతంలో మతచిచ్చులతో కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మతచిచ్చులు రేకెత్తించి… మెదక్ ప్రాంత ప్రజల్లో భయాందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించారని ఆయన ఆరోపించారు. స్వార్థం కోసం రాజకీయాలను వాడుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. అంతే కాకుండా శనివారం రాత్రి కొందరు అల్లరుమూకలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తుల ద్వంసంకు కారకులైన వారిని ఎంతటి వారు అయినా ఉపేక్షించేది లేదని పోలీస్ శాఖకు సూచించారు. అంతే కాకుండా ఆదివారం జరుగుతున్న నల్లపోచమ్మ బండ్ల కార్యక్రమంతో పాటు సోమవారం జరిగే బక్రీద్ పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం గస్తీ ఖాయాలని ఆయన ఆదేశించారు.
యువతరం దేశానికి ఆదర్శంగా నిలువాలి….!!
యువత దేశానికి ఆదర్శంగా నిలువాలని… రేపటి భవిష్యత్ నేటి యువతరమే అని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సూచించారు. మత విద్వేశాలను రెచ్చగొడుతున్న వారి మైకంలో ఉండకుండా మీ ఉజ్వల మైన భవిష్యత్ ను పాడుచేసుకోవద్దని ఆయన హితవు పలికారు. స్వార్థ రాజకీయాల కోసం యువత తొందరపాటు పడి తల్లిదండ్రులను ఇబ్బంది కల్గించవద్దని ఆయన హితవు పలికారు.
పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలి…!!
శాంతిభద్రతల విషయంలో పోలీసులు 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో పట్టణ ప్రజలు పోలీసు శాఖకు సహకరించాల్సిందిగా నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కోరారు. పట్టణంలో ఎక్కడా అహింసా జరగకుండా ఉండేందుకు, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు పోలీసులు తోడ్పాటుపడుతున్నారని ఆయన పేర్కోన్నారు.