Reporter -Silver Rajesh Medak.
తేది -16 -జూన్ -2024.
నిబంధనల మేరకు బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
బక్రీద్ పండుగ నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ బాలస్వామి అడిషనల్ ఎస్పీ మహేందర్ తో కలసి రెవిన్యూ, పశు సంవర్ధక, మున్సిపల్, పంచాయతీ, ట్రాన్స్పోర్ట్, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మెదక్ జిల్లా చాల ప్రశాంతవంతమైన ప్రాతం అని, మాత సామరస్యానికి చిహ్నం అని, ప్రతి పండుగను కుల మతాల అతీతంగా జరుపుకుంటారనీ, అదే సంస్కృతిని కొనసాగించి ప్రజలందరు శాంతిభ్రతలను కాపాడటానికి సహకరించాలని కోరారు.
జిల్లా ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ విజయ శేఖర్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్, తహసీల్దార్ మహేందర్ గౌడ్, పోలీస్, పంచాయతీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.