రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 14:- రక్తదానం ప్రాణదానమని ఆపదలో ఉన్నవారికి రక్తదాత మానవత్వంతో చేసిన రక్తదానం ముగ్గురి నుండి నలుగురి ప్రాణాలను కాపాడుతుందని రాష్ట్ర రవాణా బీసీ వెల్ఫేర్ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ రాజ్ భవన్ సంస్కృతి భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రక్తదానం చేస్తున్న రక్తదాతలను వారి అమూల్యమైన సేవలను గుర్తించడానికి అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని 33 జిల్లాలలో కలిగిన రెడ్ క్రాస్ శాఖల నుండి ఎక్కువసార్లు రక్తదానం చేసి రక్తదాన శిబిరాలను నిర్వహించిన ప్రోత్సాకులకు అవార్డులను ఇచ్చి గుర్తించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్ వ్యక్తిగత కార్యదర్శి బి.వెంకటేశం పాల్గొని ఇటీవల కాలంలో రక్తదానం చాలా ప్రాముఖ్యతను ఆవశ్యకతను పొందిందని గర్భిణీ స్త్రీలకు, తలసీమియా వ్యాధిగ్రస్తులకు రహదారుల పైన ఆక్సిడెంట్ల వలన రక్తము అవసరం ఉన్నవారికి రక్తదాతలు వారి మానవత్వం నిరూపించి రక్త దానము చేసి వారి ప్రాణాలను కాపాటంలో ముందుంటున్నారని తెలిపారు.అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో రక్తనిధి కేంద్రాలను స్థాపించి రోగులకు అవసరం ఉన్నవారికి సేవలు అందిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ ఎస్టినో మాట్లాడుతూ రక్తం కుటుంబంగా తయారు చేయడం కుదరదని 18 సంవత్సరంలో పైబడిన ఎవరైనా ముఖ్యంగా యువతీ యువకులు సంవత్సర కాలంలో మూడు నుండి నాలుగు సార్లు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కె.సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అవసరం ఉన్న సమయంలో రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ మిశ్రా గారు మాట్లాడుతూ రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖ ద్వారా నిర్వహింపబడిన కేంద్రాల ద్వారా రక్తం సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి సంవత్సర కాలంగా నిర్వహించిన రక్తనిధి కేంద్రాల సేవలను వివరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోటిరెడ్డి ,జూనియర్ రెడ్ క్రాస్ పూర్తి రెడ్ క్రాస్ కన్వీనర్లు శ్రీనివాసరావు రమేష్ మియాపురం ఒంటరి శ్రీనివాస్ రెడ్డి మెదక్ శాఖ రాష్ట్ర ప్రతినిధి సింగం శ్రీనివాసరావు మరియు వివిధ జిల్లాల నుండి పాల్గొన్న జిల్లా చైర్మన్లు మెదక్ శాఖ నుండి అత్యధిక 53 సార్లు రక్తదానం చేసి రక్త దానము, అవయవ దానము పై అవగాహన కార్యక్రమములు నిర్వహిస్తున్న లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్రెడ్డిని అత్యధిక రక్తదాన శిబిరంల నిర్వహణకు కృషిచేసి 1095 యూనిట్లకు ప్రోత్సాహించిన తోగరు సుభాష్ చంద్రబోస్ అవార్డులను అందజేసి అవార్డు గ్రహీతలను అభినందించారు.