సర్వసిద్ది పి.హెచ్.సి పరిధి లో ప్రపంచ రక్తదాన దినోత్సవం” పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన ర్యాలీ

సర్వసిద్ది పి.హెచ్.సి పరిధి లో “ప్రపంచ రక్తదాన దినోత్సవం” పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన ర్యాలీ

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మరియు కర్రీవానిపాలెం గ్రామాల్లో జిల్లా ఇన్ చార్జి వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలాజీ ఆదేశాలు మేరకు “వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే” సందర్భంగా ఇన్ చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్.దీపిక పర్యవేక్షణలో అవగాహన ర్యాలీలు నిర్వహించారని ఆరోగ్య విస్తరణ అధికారి టి. నాగేశ్వరరావు తెలిపారు. వీరితో పాటు హెల్త్ సూపర్ వైజర్ ఎస్ ఎస్ వి ప్రకాష్, హెల్త్ విజిటర్ వై.సూర్య కుమారి, ఎఫ్.డి.పి. పర్యవేక్షకులు డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ , బి.ప్రేమ్ కుమార్ , స్టాఫ్ నర్సు భవాని , ల్యాబ్ టెక్నీషియన్ ఐ.హరి నాథ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఎల్.వీణ వాహిని, డి.రమాదేవి, హెల్త్ సెక్రటరీ లు ఎన్.రాజేశ్వరి, జి.బేబీ, కె.విజయ , ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీ ని ఉద్దేశించి ఇన్ చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్.దీపిక మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు రక్త దానం చేయటం ఆరోగ్యానికి మంచిదని రక్త దానం చేయడం వలన కొత్తగా రక్త కణాలు ఉత్పత్తి అవుతాయని తద్వారా వ్యాధి నిరోధక శక్తి ( ఇమ్యూనిటీ ) పెరుగుతుందని అలాగే ఇచ్చే దాత బరువు కనీసం 50 కేజి లు వుండాలని , వయసు 18 నుండి 60 సంవత్సరాలు లోపు వారు అర్హులని , హిమోగ్లోబిన్ 12.5 గ్రాములు కనీసం వుండాలని, పల్స్ రేట్ 50 నుండి 100 లోపు స్థిరంగా వుండాలని ,బి.పి సిస్టోలిక్ 100 నుండి 180 మధ్య స్థిరంగా వుండాలని, డయాస్టోలిక్ 50 నుండి 100 లోపు వుండాలని , అంటు వ్యాధులు ,హెచ్.ఐ.వి ,క్యాన్సర్, క్షయ, మధుమేహం ,ఉబ్బసం ,రేబిస్ వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయటానికి అనర్హులు అని,ప్రతి ఆరోగ్యవంతమైన పురుషులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చునని, అలాగే ప్రతి ఆరోగ్యవంతమైన స్త్రీ నాలుగు నెలలు కు ఒక్కసారి రక్త దానం చేయవచ్చునని డాక్టర్ సి.హెచ్.దీపిక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్.డి.పి క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పి .ఎన్.వి.ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ లో 1.రక్త దానం చేయండి..ప్రాణ దాతలు అవ్వండి ; 2. ఒకరికి రక్త దానం …మరొకరికి అదే ప్రాణాధారం ; 3. అన్న దానం ఆకలి తీర్చుతుంది..రక్త దానం ప్రాణం నిలుపుతుంది 4.రక్త దానం చేద్దాం ..మరొకరికి ఆయుష్షు ను పెంచుదాం అనే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఇందులో ఆశా కార్యకర్తలు,గ్రామ పెద్దలు,యువకులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!