Reporter -Silver Rajesh Medak.
తేదీ 10-6-2024
మెదక్
ప్రజావాణికి వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలి కలెక్టర్ రాహుల్ రాజ్
ఈరోజు ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులు 91
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రజల నుంచి కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు దరఖాస్తులు స్వీకరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన ధరఖాస్తులని త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణికి వచ్చిన వారు మళ్లీ పదే పదే రాకూడదని అర్హతను బట్టి వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో సమస్య పూర్వపరాలను
వివరించాలన్నారు
. అప్పుడే ప్రజావాణి పై ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు.
ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు.
భూ సమస్యలు- 30
పెన్షన్ -10
డబుల్ బెడ్ రూమ్ -3
ఉద్యోగం -2
ఇతర -46
మొత్తం 91దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.