Reporter -Silver Rajesh Medak.
తేదీ 10-6-2024
మెదక్ జిల్లా
మెదక్ జిల్లాలో 100% అక్షరాస్యత లక్ష్యంగా పని చేయాలి
— జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో త్వరలో ప్రారంభం కానున్న “న్యూ ఇండియా లిటరసీ ” కార్యక్రమంపై సమీక్షించారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 100 శాతం అక్షరాస్యతలో నిలపడంలో అధికారులు భాగస్వామ్యo కావాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో ప్రతి ఒక్కరికి 15 సంవత్సరాల వయసు నిండిన వారి నుండి ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం రావాలన్నారు.
మెదక్ జిల్లాలో గతంలో ఉన్న అక్షరాస కంటే మెరుగైన అక్షరాస్యత నమోదు చేసి రాష్ట్రంలో అక్షరాస్యతలో మొదటి స్థానంలో నిలపాలన్నారు.
దీనికోసం గ్రామస్థాయిలో ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయాలని, గ్రామ మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తికి చదవడం, రాయడం రావాలన్నారు.
పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి
ఈ నెల 12 తారీఖున పాఠశాలలు పున: ప్రారంభంనాటికి పాఠశాల పరిశుభ్రంగా ఉంచాలని, పాఠశాలలో అన్ని పనులు పూర్తి చేయాలని, పాఠశాలలో ఉన్న స్టాక్ ను చెక్ చేసుకోవాలని పాడైపోయినటువంటి స్టాక్ లు ఏమైనా ఉంటే తీసేయాలన్నారు.
మధ్యాహ్న భోజన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
ఏక రూప దుస్తులు కుట్టడం పూర్తిచేయాలని ,12వ తారీకు రోజున పాఠశాల విద్యార్థులకు అందించాలన్నారు.
పాఠశాల విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ త్వరగా అందించాలన్నారు .
పాఠశాలలో త్రాగునీరు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని , అంగన్వాడీలలో కొత్త విద్యార్థులను నమోదు చేసుకోవాలన్నారు.
అంగన్వాడి పాఠశాల పూర్తయిన విద్యార్థుల్ని ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలన్నారు.
జిల్లాలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేదని, అన్ని రకాల ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా విద్యాధికారి రాదా కిషన్ , జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.