మెదక్ (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) సిల్వర్ రాజేష్.
తేది -09.06.2024.
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ -1 ప్రిలిమినరీ రాత పరీక్ష. జిల్లా ఎస్పి డా. బి. బాలస్వామి
జిల్లా వ్యాప్తంగా గ్రూప్ -1 ప్రిలిమినరీ రాత పరీక్షకు 3912మంది గాను, 3125 మంది హాజరు. 787 మంది గైర్హాజరు.
జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారి పర్యవేక్షణలో గ్రూప్ -1 ప్రిలిమినరీ రాత పరీక్ష మెదక్ జిల్లాలో మొత్తం 10 పరీక్ష కేంద్రాల దగ్గర బందోబస్తును ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణం లో పరీక్షలు జరిగేలా అన్నీ చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. గ్రూప్ -1 రాత పరీక్షను మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నందున జిల్లా కేంద్రంలోని 10 సెంటర్లలో కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా అదనపు ఎస్.పి.మహేందర్, మెదక్ DSP. డా.రాజేష్ ,తూప్రాన్ DSP.వెంకట్ రెడ్డి , సంబందిత సర్కిల్ సి.ఐ.లు, ఎస్.ఐ లు, రీజినల్ కో-ఆర్డినేటర్ గార్ల ఆధ్వర్యంలో పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు.