నార్సింగి మృగశిర కార్తి( మిర్గమ) శనివారం నాడు రావడంతో ప్రజలు చేపలు తినాలని పూర్వం నుండి నానుడి .కాగా రైతులకు అనుకూలమైన వర్షాకాలం కార్తి కావడంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టే రోజు . చేపల కూర తినడం ఆనవాయితీ కావడంతో గ్రామాలలో పట్టణాలలో చేపలకి మంచి గిరాకీ వచ్చిందని చేపలు అమ్మే దుకాణదారులు సంతోషం వ్యక్తం చేశారు . నార్సింగి పట్టణంలో శనివారం నాడు చేపలకు గిరాకీ వచ్చింది .మండలంలో చేపల అమ్మకాలు జోరుగా సాగాయి. చేపలు కావాలంటే మళ్లీ వర్షాలు పడ్డాక కొత్త నీళ్లతో చెరువులలో రావడం సమయం పడుతుంది అందులో పెంచిన చేపలు కావాలంటే మూడు నెలలు టైం అవుతది అందుకు మిర్గం ప్రత్యేకించింది. కాబట్టి చేపలు తినడంలో ప్రజలు ఇష్టపడతారు ఆచారాన్ని ఇప్పటికీ పాటించడం ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది మృగశిర కార్తికి ప్రజలలో ప్రత్యేక స్థానం ఉంది అందుకు మృగశిర కార్తి రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నదని దాన్ని ఇప్పటికీ పాటించడం గమనార్హం.