Reporter -Silver Rajesh Medak.
తేది -08/06/2024.
రేపే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ప్రాక్టీకల్స్
ఇంటర్మీడియట్ విద్యాధికారి – సత్యనారాయణ
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు కొనసాగింపుగా రేపు ఉదయం 9 నుండి ఇంగ్లీష్ ప్రాక్టీకల్స్ ప్రారంభం కానుంది. గత వార్షిక పరీక్షలో ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ లో అనుతిర్ణులైన విద్యార్థులు మరియు హాజరు కానీ విద్యార్థులు తమ కళాశాలలో తప్పని సరిగా హాజరు కావాలని ఇంటర్మీడియట్ విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 10 వ తేది ఇంగ్లీష్ ప్రాక్టీకల్స్ తో పాటుగా 11 వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పర్యావరణ విద్య 12 తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నైతికత మరియు మానవ విలువలు ఫై పరీక్షలు జరుగుతాయి. ఫై ఏదేని పరీక్షలో అనుతిర్ణులైతే ఆయా విద్యార్థులు అనుతిర్ణులుగా పరిగణిస్తారు మరియు ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ ను ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేయదు. కావున విద్యార్థులు వారి తల్లి తండ్రులు ఈ విషయాన్నీ గమనించి తప్పని సరిగా హాజరు కావాలని తెలిపారు. జిల్లా లో ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్స్ అందరు కూడా పరీక్షా తేదీల సమాచారాన్ని ఆయా విద్యార్థులకు చేరవేసి గతంలో హాజరు కానీ మరియు అనుతిర్ణులైన విద్యార్థులు పరీక్షా వ్రాసే విధంగా చూడాలని తెలిపారు.