గోల్పర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 8:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈనెల 6 నుండి 19 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బడిబాట కార్యక్రమం ద్వారా గోల్పర్తి గ్రామంలో ఇంటింటికి తిరిగి 5 సంవత్సరాల పైబడిన బడిడు పిల్లలను బడిలో చేర్పించే విధంగా తాము కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ బడిబాట కార్యక్రమంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ఉపాధ్యాయుల బృందం పర్యటించి బడిడు పిల్లలను బడిలో చేర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ బడిబాట కార్యక్రమంలో 5 సంవత్సరాలు పైబడిన బడిడు పిల్లల తల్లిదండ్రులు తమకు సహకరించి బడిడు పిల్లలను బడికి పంపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉపాధ్యాయులు బాల్ కిషన్ అంగన్వాడి టీచర్ మార్త,శోభ తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!