రామాయంపేట పట్టణంలో మృగశిర కార్తె రోజు చేపల విక్రయాలు జోరు
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 8:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో రోహిణి కార్తెలో విపరీతమైన ఎండలకు తట్టుకోలేక ప్రజలు నానా తంటాలు పడ్డారు.ఈ రోహిణి కార్తె నేటితో ముగిసింది. ముంగిళ్ళు చల్లబరిచే మృగశిర కార్తె నేటి నుండి ప్రారంభమైంది.ఈ మృగశిర కార్తెలో అధికంగా వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం.ఈ కార్తె ప్రవేశం వర్షాకాలం ఆరంభానికి సూచనగా రైతులు భావిస్తారు.ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.మృగశిర కార్తె ప్రారంభం రోజు ప్రజలు ఇంగువ బెల్లం కలిపి తింటారు.ఇంగువ శరీరంలోని వేడి ఉష్ణాన్ని ప్రేరేపించి వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఉంటారని పెద్దలు చెబుతారు.అదేవిధంగా మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఎలాంటి వ్యాధులు రావని ప్రజలు నమ్మకం.ఇందుకోసం రామాయంపేట పట్టణంలో సిద్దిపేట చౌరస్తాలో సీతయ్య గుడి సమీపంలో చేపల విక్రయదారులు అమ్మకాలు జోరుగా చేపట్టారు.ఈ చేపల కోసం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తండుపతండాలుగా తరలివచ్చారు.మృగశిర కార్తె సందర్భంగా చేపల విక్రయదారులు వివిధ ప్రాంతాల నుండి చేపలు తీసుకొచ్చి మండలంలోని వివిధ గ్రామాల ప్రధాన కూడళ్ల వద్ద రౌట చేపలు,బంగారు తీగలు కిలోకు 150 నుండి 200 వరకు బొచ్చ చేపలు కిలోకు 100 నుండి 150 వరకు కొర్రమీను చేపలు 400 నుండి 500 వరకు భారీగా విక్రయించారు.