మాజీ టెలికం బోర్డు మెంబర్అంచనూరి రాజేష్ ఎంపిటిసి సత్యనారాయణ,,,
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో బుధవారం నాడు కాంగ్రెస్ నాయకులు మాజీ టెలికం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ ఎంపిటిసి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బిజెపి బిఆర్ఎస్ కుమ్మక్కై బిసి బిడ్డ నీలం మధుపై కుట్ర చేసినా నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే అన్నారు.మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీసీ బిడ్డ అయినా నీలం మధును ఓడించాలని కాంగ్రెస్ బిఆర్ఎస్ చేసిన పన్నాగం అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే అంతర్గత ఒప్పందంలో బిజెపి విజయం సాధించిందని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏమీ అభివృద్ధి చేసిందని డబ్బు అహంకారం ఓడిపోయిందన్నారు.అదే బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న పేద ప్రజలకు ఏ పథకాలు అందించి ఏం ఓరగా బెట్టారని అన్నారు.బిఆర్ఎస్ బిజెపి పార్టీలు ఒకటై కాంగ్రెస్ పార్టీని ఓటమిపాలు చేశారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే ఓర్వలేకే ఇలా కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా నైతిక విజయం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుదే అని వ్యక్తం చేశారు.