Reporter -Silver Rajesh Medak.
మెదక్, మే-31, 2024
పక్కా ప్రణాళికతో సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, జిల్లాలో అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు
శుక్రవారం టేక్మాల్ మండలం కేంద్రంలో 69.60 క్వింటాళ్ల జిలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈసారి గత సంవత్సరం కంటే పది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించనున్నాయని అందువల్ల గతం కంటే పది రోజుల ముందుగానే వర్షాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. రైతులు సాగుకు సమాయత్తం అవుతున్న దృష్యా విత్తనాలు కొరత లేదని సమృద్ధిగా ఉన్నాయన్నారు.
ఖరీఫ్ సీజన్ సాగులో జిల్లాలో వరి 3,73,509 ఎకరాలలో పంటలు సాగు అవుతాయిని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు.
దీనిలో ముఖ్యంగా వరిపంట 327113, ప్రత్తి 40619 ఎకరాలు, మొక్కజొన్న 2820 ఎకరాలు, కంది 1125 ఎకరాలు మరియు ఇతర పంటలు 1832 ఎకరాలు సాగుకు ప్రణాళికలు వేయడం జరిగిందని అన్నారు.
ఈ మేరకు ప్రస్తుతం 32088 ప్యాకెట్ల పత్తి విత్తనాలు డీలర్ల దుకాణాలలో అందుబాటులో ఉన్నావని తెలిపారు
ప్రభుత్వ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి డీలర్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని, తమ దుకాణంలోని స్టాక్ వివరాలు బోర్డు పై ప్రదర్శించాలని, వాటి వివరాలు ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని సూచించారు.
గడువు ముగిసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మవద్దని పేర్కొన్నారు.
ప్రతి అమ్మకానికి సంబంధించి రసీదు రైతులకు అందజేయాలని కలెక్టర్ తెలిపారు.
రైతులు కూడా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. .
నకిలీ విత్తనాలు ఎక్కడైనా విక్రయిస్తునట్టు సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.
పోలీసులు, వ్యవసాయ అధికారులు, దుకాణాల డీలర్లు కలిసి వీటిని అరికట్టాలని సూచించారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వచ్చిరొట్ట విత్తనాలు నాటుటకు జూన్ రెండవవారం వరకు సమయం ఉన్నదని రైతులు గుర్తించాలన్నారు.
పచ్చిరొట్ట పంటలు మెదక్ జిల్లాలో 6400 క్వింటాల్ అవసరం అవుతాయని ప్రణాళిక వేసుకోవడం జరిగిందని. దీనికి గాను ఇప్పటి వరకు 4787 క్వింటాళ్లు పచ్చి రొట్ట విత్తనాలు రైతులకు అందించడం
జరిగిందన్నారు.
మిగిలిన 1613 క్వింటాళ్ల విత్తనం కూడా వారం రోజులలో రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
కావున రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ సరిపడా విత్తనాలను అంద చేయుటకు చర్యలు చేపట్టామని తెలిపారు.
రైతులు ఎవరు అధైర్య పడవద్దని పచ్చిరొట్ట పంటలు వేసుకోవడానికి ఇంకా సమయం మిగిలి ఉందని భూమిలో సరైన తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలని రైతులకు సూచించారు,
పచ్చి రొట్ట విత్తనాలు తీసుకున్న రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించడం జరిగింది.
వచ్చే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు అందిందాలని సూచించారు
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సందాలకులు రాంప్రసాద్ మరియు మండల వ్యవసాయ అధికారి స్వప్న మరియు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పాల్గొన్నారు.