Reporter -Silver Rajesh Medak.
తేదీ 31-5-2024
మెదక్ జిల్లా
క్రమశిక్షణకు, అంకితభావానికి పెట్టింది పేరు గోడవెల్లి సుబ్రహ్మణ్యం (ఏవీఎస్)
సుబ్రహ్మణ్యం పదవీ విరమణ కార్యక్రమంలో
— జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం ఏవీఎస్ సుబ్రహ్మణ్యం పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ
మెదక్ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఉద్యోగంలో చేరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓడి పై రాజభవన్ హైదరాబాదులో తన అమూల్యమైన సేవలు సుబ్రహ్మణ్యం అందించారని, ఎంతోమంది ఉన్నతాధికారుల మన్నలు పొందిన వ్యక్తిగా గుర్తింపు పొంది తనకు ఇచ్చిన బాధ్యతను క్రమశిక్షణగా నిర్వర్తించారని అన్నారు. సుబ్రహ్మణ్యం కు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పూలమాలవేసి శాలువాతో సన్మానం చేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
పదవి విరమణ పొందుతున్న సుబ్రహ్మణ్యం దంపతులకు జిల్లా పౌరసంబంధాల అధికారి కే రామచంద్ర రాజు , సిబ్బంది సుబ్రహ్మణ్యం వారి సతీమణి వెంకటేశ్వరి దంపతులకు శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించి ఆయన శేష జీవితం ఆనందంగా గడపాలని అభివర్ణించారు.
మెదక్ జిల్లా పౌర సంబంధాల అధికారి రామచందర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సర్వసాధారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఓ బాబురావు, పబ్లిసిటీ అసిస్టెంట్ ప్రదీప్ కుమార్, పవన్ సింగ్,ప్రవీణ్ కుమార్, ఆఫీస్ సబార్డినేట్లు సత్యనారాయణ, భూమయ్య, కృష్ణయ్య , వారి కుటుంబ సభ్యులు గుణ శేఖర్,జాహ్నవి ,తదితరులు పాల్గొన్నారు.