రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 30:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన గణేష్ అనే (16) సంవత్సరాల బాలుడు తన సొంత బైక్ పై తమ తల్లి ఉంటున్న కేసీఆర్ కాలనీకి రామాయంపేట నుండి వెళుతుండగా గోల్పర్తి బైపాస్ టర్నింగ్ లో రోడ్డు పక్కన ఉన్న ఫ్లెక్సీ బోర్డును ప్రమాదవశాత్తు డీకొని తలకు తీవ్ర గాయాలు కావడంతో బాలుని అతనితో ఉన్న మరొక బాలునికి కూడా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలుని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.