15 సంవత్సరాల క్రితం నుండి పాడు బడిన అంగన్వాడీ భవనం.
పూర్తికాని అంగన్వాడీ భవనం-బిల్లులు స్వహ చేసిన గుత్తే దారులు.
అంగన్వాడీ భవనం నిర్మించారు ప్రారంభం చేయడం మరిచిపోయారు.
కొమురంభీం జిల్లా, చింతలమానేపల్లి మండలం, బాబాసాగర్ గ్రామం, ఇందిరానగర్ హ్యాబిటేషన్ (కాలనీ ) లో గత 15 సంవత్సరాల క్రితం అంగన్వాడీ భవనం నిర్మాణం చేపట్టి కేవలం బిల్లు కోసమే తాత్కాలికముగా భవనం కట్టి ఇంకా భవనం పూర్తి కాకుండానే చేతులెత్తెసిన గుత్తేదారులు. కేవలం అంగన్వాడీ పోస్ట్ కోసమే ఇందిరానగర్ పేరుతొ సెంటర్ కానీ అంగన్వాడీ భవనం 15 సంవత్సరాలనుండి నిర్మాణంలోనే వుంది, భవనం నిర్మాణం పూర్తి అయ్యేదేప్పుడు, అంగన్వాడీ సెంటర్ నడిచేదెప్పుడు, ప్రస్తుతం అంగన్వాడీ భవనం ఒక చెత్త కూపంగా మారింది,వర్షాకాలంలో చెత్త చెదారంతో నిండి భవనం దుర్గంధంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.
అనేకసార్లు గ్రామపంచాయతీ కార్యాలయం లో సంభందిత అధికారులకు ఫిర్యాదు చేసిన గాని చూసి చూడనట్టు, అసలు తమకేమి పట్టనట్లు వ్యవహారిస్తున్నారు. బాబాసాగర్ గ్రామంలో 2000 పై చిలుకు ఓటర్ లున్న పెద్ద గ్రామపంచాయతీ కాగా ఇక్కడ 4 అంగన్వాడీ సెంటర్ లు, నలుగురు అంగన్వాడీ టీచర్ లు, ఆయలు వున్నారు. ఇందులో ఒక అంగన్వాడీ సెంటర్ లో మాత్రమే సెంటర్ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఇద్దరు అద్దె ఇళ్లలో సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇందిరానగర్ లో అంగన్వాడీ భవనం వుంది మంచి ఆహ్లాద కరమైన వాతావరణం వుంది కాలనిలో నడి మధ్యలో వుంది అయినా ఆ భవనం పాడుబడ్డ భావనంగా మారింది ఇక పేరుకే అంగన్వాడీ సెంటర్ కానీ ఎక్కడ నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియదు అంతేకాదు. ఇందిరానగర్ లోని అంగన్వాడీ సెంటర్ కు టీచర్ ఎవరో ఇప్పటికి ఎవరికీ తెలియదు.
పిల్లలు అంగన్వాడీ దశ నుండే విద్యబుద్దులు నేర్చుకునేది అంగన్వాడీ భవనం నిర్మించిన పేరుకు ఇందిరానగర్ సెంటర్ కానీ అది ఎక్కడ ఉందొ ఎవ్వరికి తెలియదు, పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల లకు పిల్లల్నీ పంపుతున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ లకు అనేక సౌకర్యాలు కల్పించి జీతాలు ఇస్తున్నారు, పిల్లలకు మంచి పోషక ఆహారం ఇస్తున్నారు. కానీ అంగన్వాడీ సెంటర్ లకు కేటాయించిన భవనాలలోనే అంగన్వాడీ నిర్వహణ జరగాలి. కానీ ఆలా జరగడం లేదు. అంగన్వాడీ భవనం నిర్మించారు కానీ విద్యార్థులేరి., టీచర్ ఎక్కడ. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ భవనం సెంటర్ లలోనే విద్యానిర్వహణ జరగాలని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.