నిరుపేద వధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేసిన రాజిరెడ్డి
రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) మే 24:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన కోమ్మగళ్ళ సత్తమ్మ – ప్రభాకర్ దంపతుల కూతురు వసంత వివాహనికి ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు వెంకుగారి రాజిరెడ్డి శుక్రవారం గ్రామంలో పుస్తే మట్టెలను అందజేసి మానవత్వం చాటుకున్నారు.గ్రామంలో ఈ వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద వధువు వివాహాలకు ఎవరైనా వధువులు ఉంటే వారికి పుస్తే మట్టేలు అందజేస్తామని అన్నారు.ఈ సందర్భంగా పెళ్లికూతురు తల్లిదండ్రులు వెంకుగారి రాజిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గజ్జల రామచంద్ర రెడ్డి , సిద్ధ రాములు, మాజీ ఎంపిటిసి స్వామి తదితరులు పాల్గొన్నారు.