రామాయంపేట మిని స్టేడియం నిర్మాణం జరిగేనా?

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 24:- మెదక్ జిల్లా రామాయంపేట ప్రాంతము పట్టణము జాతీయ రహదారి ఆనుకొని ఉండగా వ్యాపార పరంగా రాజకీయపరంగా అభివృద్ధి దశలో కొనసాగుతున్న రాజకీయ నాయకుల అలసత్వం స్వార్థపరమైన రాజకీయపరంగా ఇప్పటికీ వెనుకబడి పేరు ప్రతిష్టలకు నోచుకోకపోవడానికి మరో కారణం రాజకీయాలను తమ అభివృద్ధికి వాడుకుంటూ యువకులను సైన్యాలుగా తయారు చేసుకోవడం కనీసం మానసికంగా శరీరకంగా ఎదగడానికి సహాయ సహకారాలు అందించడంలో విఫలమవుతున్నారు.గతంలో 10వ తరగతి తర్వాత ఇక్కడ ఎస్.ఎస్.ఎల్.సి నేటి డిగ్రీకి సమాంతరంగా పాఠశాలలు నడిచాయి.అందులో భాగంగానే నేటి కళాశాల మైదానం అనేక క్రీడలకు నాటి విద్యార్థుల క్రీడా విన్యాసాలకు రామాయంపేట మైదానం వేదిక అయింది.కనీసం 50 సంవత్సరాల క్రితంo మైదానంలో ఫుట్బాల్ హాకీ బాస్కెట్బాల్ మైదానాలు ఉండేవి ఫుట్బాల్ జిల్లా స్థాయిలో రామాయంపేట క్రీడాకారులు ప్రతిభ చూపడమే కాకుండా నిత్యం ప్రాక్టీస్ జరిగేది.మెదక్ వెస్లీ మైదానంలో జరిగే పోటీలలో రామాయంపేట ఎంతో ప్రతిభ పాటపాలను ప్రదర్శించిన నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. 1979-80 దర్శకంలో క్రీడాకారులు రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి వరకు అనేక క్రీడల్లో తమ ప్రతిభను చాటిన దర్శనాలు ఉన్నాయి.కానీ రాజకీయాల స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్న మైదానంలో జూనియర్ కళాశాల ఫుట్బాల్ హకి మైదానాలలో యువజన సంఘాలు అడ్డుపడిన అప్పటి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బలవంతంగా నేటి పోలీస్ స్టేషన్ క్వాటర్స్ నిర్మించడం జరిగింది.6 ఎకరాల మైదానం మూడు ఎకరాలకు చేరుకోవడం క్రీడలకు ఎలాంటి ఆసరా లేకపోవడంతో లేకపోవడం వల్ల క్రీడాకారులు ప్రైవేట్ పరంగానే నామమాత్రంగా క్రీడలు నిర్వహించుకుంటున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ ప్రభుత్వంలో రామాయంపేటకు 2 కోట్ల 62 లక్షల వ్యయంతో మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చే సిన అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయడం జరిగింది.అది ఒక కొండ ప్రాంతం మరియు ఎట్లైనా సమాంతరంగా లేని ప్రాంతాన్ని ఎన్నిక చేయడం విచారకరం బైపాస్ కు ఆవలి వైపున ఈ ప్రాంతాన్ని చేయడానికి కారణాలేమిటో తెలియరాలేదు. కానీ బైపాస్ కి ఈవలి వైపున అసైన్డ్ భూములు సమాంతరంగా అనుకూలంగా ఉన్న కొండ ప్రాంతాన్ని మాత్రమే ఎంపిక చేసి దాని నిర్మాణానికి చదును చేయడానికి పని కూడా మొదలుపెట్టారు.కానీ ఆ కాంట్రాక్టర్ 60 లక్షలు ఖర్చుపెట్టి మట్టిని గుట్టను తవ్వడం ఎంతకు పని కాకపోవడంతో వదిలేసి వెళ్లిపోయాడు.ఇప్పుడు కూడా ఆ భూమి గుట్టలు కొండలు రాళ్లతో ఎప్పటికీ కూడా చరిత్రలో నిర్మాణానికి అనుకూలం అయ్యే పరిస్థితిలో లేనట్టే కనిపిస్తున్నది. ఇంత కష్టతరంగా నిర్మించడానికి కారణాలు ఏమైనా ఇప్పటికైనా అధికారులు నాయకులు ఆ ప్రాంతాన్ని వదిలి ఈవలి వైపునున్న అసైన్డ్ భూములలో మినీ స్టేడియం పనులు నిర్వహిస్తే నిర్మాణం చేపడితే తక్కువ ఖర్చులోనే మిని స్టేడియం నిర్మాణం జరుగుతుందని ఆయన క్రీడపండితులు క్రీడా సంఘాలు క్రీడాకారులు కోరుతున్నారు.డబ్బులు మంజూరై సిద్ధంగా ఉన్న క్రీడ అధికారులు కూడా అనుకూలంగా ఉన్న దీనిని నిర్మాణం చేపట్టడానికి ఎందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా మన మెదక్ యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి స్థానిక అధికార పార్టీ నాయకులు తీసుకువెళ్లి మినీ స్టేడియం నిర్మాణం చేస్తే మండలంలోని పట్టణంలోని క్రీడాకారులు నిత్యసాధనతో క్రీడా శిక్షకుల తర్ఫీదుతో జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లే ఆస్కారం ఉంటుంది.కావున అధికార నాయకులు అధికారులు స్టేడియం అని నిర్మాణానికి ముందుకు రావాలని క్రీడా సంఘాలు క్రీడాకారులు క్రీడ ప్రేమికులు తల్లిదండ్రులు విద్యార్థులు యువజన సంఘాలు కోరుతున్నాయి.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!