రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 21:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు మంగళవారం రోజు రామాయంపేట మరియు నిజాంపేట ఉమ్మడి మండలాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెదక్ జిల్లా డీఈఓ రాధా కిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలలో పెండింగ్ లో ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఈ నెల చివరి వరకు పూర్తి చేసి పెయింటింగ్ కు రెడీ చేయాలని డిఈఓ రాధాకిషన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీలకంఠం, ఏఎస్ఓ నవీన్ కుమార్, ఎంఎన్ఓ శ్రీనివాస్ మరియు యాదగిరి, ఎఇఎస్ కుషాల్, శరత్ ఎంపీడీవో రామాయంపేట మరియు నిజాంపేట మండలాల ప్రధానోపాధ్యాయులు మరియు సిఆర్పిలు రాజు, రజిత ,రవీందర్, ఎంఐఎస్ సంతోష్ పాల్గొన్నారు.