రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి గత కొంతకాలంగా కామారెడ్డి జిల్లా పెద్ద మాల్లారెడ్డి ఎంఎస్ఎన్ కంపెనీలో కార్మికునిగా పనిచేస్తున్న ఆయన 15 రోజుల క్రితం తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో సిఐటియూ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ సిఐటియూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలామణి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులకు భద్రత కల్పించడంలో ఎంఎస్ఎన్ కంపెనీ పూర్తిగా విఫలమైందని అన్నారు. గత కొన్ని రోజుల క్రితం మాల్లారెడ్డి ఎంఎస్ఎన్ కంపెనీలో గాయపడ్డ కార్మికులకు భద్రత కల్పించడంలో కంపెనీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్లే తరచుగా కార్మికులు గాయాల పాలవుతున్నారన్నారు. గాయపడ్డ కార్మికునికి చికిత్స అందించడంలో కూడా కంపెనీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. గాయపడ్డ కార్మికునికి పూర్తిగా గాయం నయం అయ్యేవరకు చికిత్స అందించాలని వారు డిమాండ్ చేశారు. గాయపడ్డ కార్మికుల కుటుంబాన్ని కంపెనీలు ఆదుకోవాలన్నారు.గాయపడ్డ కార్మికుడు చికిత్స పొందుతున్న సమయంలో పూర్తి వేతనం చెల్లించాలన్నారు. గాయపడ్డ కార్మికుడు కోలుకున్నాక తిరిగి తనకు తగిన పని కల్పించాలన్నారు. కంపెనీలో పనిచేసే మిగతా 600 మంది కార్మికులకు ప్రమాదాలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి పిఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలన్నారు.