రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) మే 18:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదేవిధంగా మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రామాయంపేట మండల తహసిల్దార్ రజనీకుమారి శనివారం నాడు సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి త్వరత్వరన ధాన్యం కొనుగోలు కేంద్రాల అధికారులు కొనుగోలు చేయాలని తెలిపారు.అదే రీతిగా మండలంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల అధికారులు లారీల ద్వారా రైస్ మిల్లులకు వెంటనే ధాన్యాన్ని చేరవేయాలని ఆమె అధికారులకు సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రికార్డులు సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.