Studio 10TV ప్రతినిధి (సిల్వర్ రాజేష్).
తేదీ 18/5/2024
మెదక్
గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు
పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి..
ప్రశాంతంగా జరిగేలా
ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..
ఎలాంటి తప్పిదాలు
జరగకుండా చూసుకోవాలి..
పరీక్ష కేంద్రాల్లో
అన్ని వసతులు కల్పించాలి..
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి..
ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించవద్దు..
నిబంధనలు పాటించాలి..
అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూడాలి..
తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి..
టీఎస్ పీఎస్సీ చైర్మన్
మహేందర్ రెడ్డి
గ్రూప్-1 ఎగ్జామ్ ఏర్పాట్లపై
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
జూన్ 9న జరగనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని టీఎస్ పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు సీపీలు, ఎస్పీలు డీసీపీలతో టీఎస్ పీ ఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
మెదక్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీఎస్పీ ఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పరీక్ష ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేలా కలెక్టర్లు ఎస్పీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించాలని పేర్కొన్నారు. తగిన నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని, ఈ మేరకు సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. సెల్ఫోన్లతోపాటు ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆదేశించారు. కలెక్టర్లు పోలీస్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆయా పరీక్ష కేంద్రంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నపత్రాలను ఆయా పోలీస్ హెడ్ క్వార్టర్లలో తగిన బందోబస్తు మధ్య ఉంచాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లాలని, పరీక్ష కంటే ముందు ఇన్ టైంలో చేరేలా చూడాలని సూచించారు. జూన్ 9న 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించాలని, అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. అభ్యర్థులు ఇన్విజిలేటర్లు సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. పరీక్ష కేంద్రాల్లో కిటికీల వద్ద తగిన భద్రత సిబ్బందిని ఉంచాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రహరీ గోడల వెంట చుట్టూరా తగిన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలకు సంబంధించి ఎలాంటి మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీ జరగకుండా పకడ్బందీగా వ్యవహరించాలని తెలిపారు. రీజినల్ కోఆర్డినేటర్స్ చీఫ్ సూపరిండెంట్లు పరీక్ష ముగిసే సమయం వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూసుకోవాలని, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. పలు జాగ్రత్తలపై అధికారులకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.
సెల్ఫోన్లను అనుమతించవద్దు..
పక్కాగా అరేంజ్మెంట్స్ చేయండి..
దివ్యాంగులకు ప్రత్యేక గదులు
అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చూడండి..
ప్రభుత్వ పరీక్షల నిర్వహణకు పక్కడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రభుత్వం ద్వారా నిర్వహించే పరీక్షల నిర్వహణకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలనిజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 9 వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు టిపిఎస్సి ద్వారా నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పకడ్బంది ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. మెదక్ జిల్లా లో 10.కేంద్రాల్లో దాదాపు 4000 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, రూట్ అధికారులు, ఇన్విజిలెటర్లను నియమించాలని సూచించారు. ప్రతి కేంద్రం సీసీ కెమెరా నిఘాలో ఉంటుందన్నారు. ఈ సారి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిన నేపధ్యంలో ప్రతి కేంద్రంలో ఇద్దరు ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
నిరంతర విద్యుత్ ఉండాలని, వికలాంగుల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు సౌకర్యాలను కల్పించాలని అధికారుల ఆదేశించారు.ఈ కార్యక్రమం లో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ పాల్గొన్నారు.