May 17, 2024,
త్వరలో కేబినెట్ విస్తరణ?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోపు కేబినెట్ ను విస్తరించాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలతో కలిపి నలుగురికి అవకాశామివ్వాలని రేవంత్ యోచిస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వారికి ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. తొలి మంత్రివర్గంలో చోటు దక్కని సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.