రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) మే 11:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ప్రజలు సామరస్యంగా శాంతియుతంగా వినియోగించుకోవాలని రామాయంపేట మండల పోలింగ్ ఆఫీసర్ తహసిల్దార్ రజని కుమారి అన్నారు.ఆమె విలేకరులతో శనివారం మాట్లాడుతూ వయోజన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడమే పౌర హక్కు అని ఆమె తెలిపారు.పౌరులు ఓటు వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగానే రామాయంపేట పట్టణంలో 14 పోలింగ్ స్టేషన్లు రామాయంపేట మండలంలో మొత్తం 39 పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు పోలింగ్ ఆఫీసర్ తో పాటు నలుగురు సిబ్బంది పనిచేస్తారన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అల్లర్లు కాని జరగకుండా రూట్ ఆఫీసర్లతో పాటు పోలీస్ సిబ్బంది అధికారులు తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అదనంగా సిఆర్పిఎఫ్ పోలీస్ జవాన్లను పిలిపించడం జరిగిందన్నారు. ఈవీఎంలు జాగ్రత్త పరచడానికి పోలీసులు నిరంతరం జాగ్రత్తగా పని చేస్తారన్నారు.ప్రజలు మాత్రం తమ ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియం చేసుకోవాలని పోలింగ్ నాడు పోలీస్ సెక్షన్ 144 అమలు ఉంటుందని తెలిపారు.